ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeతెలంగాణనాబార్డు 45 వార్షికోత్సవ వేడుకలు

నాబార్డు 45 వార్షికోత్సవ వేడుకలు

– హాజరైన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్

సూర్యాపేట జిల్లా ప్రతినిధి, జూలై 17(సంచలనం న్యూస్): సూర్యాపేట జిల్లా కేంద్రంలో నాబార్డు 45వ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్, డి రవీందర్ నాయక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డిసిబి జిఎం నర్మదా మాట్లాడుతూ నాబార్డు దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ముఖ్యంగా వ్యవసాయ రంగం గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ రంగంలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్నలను పొందినదిని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా సంస్థ అధినేత ఫాదర్ జూలియన్ గ్రామీణ ప్రాంతంలోని స్వయం శక్తి సంఘాలు బలోపేతంగా ఎదగడానికి నాబార్డ్ పాత్ర ఎంతో ఉందని ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిజిబి సూర్యపేట బ్రాంచ్ మేనేజర్, కెవికె శాస్త్రవేత్తలు కిరణ్ కుమార్, అక్షత్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతు ఉత్పత్తి దారుల సభ్యులు ఎన్జీవో ప్రతినిధులు గా పాల్గొని, జ్యోతి లక్ష్మి మరియు లక్ష్మి శ్రీనివాస్ లకు ఉత్తమ ఎస్హెచ్జీ అవార్డ్ లు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!