ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeతెలంగాణప్రమాదవశాత్తు గుంతలో పడి బాలుడు మృతి

ప్రమాదవశాత్తు గుంతలో పడి బాలుడు మృతి

– కేసు నమోదు చేసిన పోలీసులు

చిట్యాల (సంచలనం వెబ్ న్యూస్): ప్రమాదవశాత్తూ గ్లోబల్ గ్యాస్ గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని ఏపూర్ గ్రామంలో ఆర్యన్ కుమార్(2) తండ్రి అజయ్ పండిట్, బీహార్, రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి ఏపూర్ గ్రామంలో గల డిఈసి కంపెనీలో పని చేస్తున్న తన మామయ్య ఇంటికి రాఖీ పండుగ సందర్భంగా వచ్చి శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో క్వాటర్స్ పక్కన ఆడుకోవడానికి ఇంటి నుండి బయటకు వెళ్ళి మధ్యాహ్నం అయిన బయటకు వెళ్ళిన బాలుడు ఇంటిక రాకపోగా, కనపడక పోయేసరికి తల్లిదండ్రులు కంపెనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో చూడగా, కంపెనీ లోపల గోబర్ గ్యాస్ కొరకు తీసినటువంటి గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయి ఉన్నట్లు, అక్కడ పడి ఊపిరి ఆడక చనిపోయి ఉన్నాడని మృతుని తండ్రి అజయ్ పండిట్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.వెంకట్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!