– కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన పోలీసులు

రామన్నపేట (సంచలనం వెబ్ న్యూస్):
వరుసగా మేకల దొంగతనాలు పాల్పడుతున్న దొంగల ముఠా ను రామన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే పోలీస్ స్టేషన్ పరిధిలోని నిధానపల్లి గ్రామంలో మేకల దొంగతనానికి పాల్పడిన కేసులో నలుగురు నిందితులను రామన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20 ఆదివారం రాత్రి నిధానపల్లి గ్రామంలో మేకల దొంగతనం జరిగిన ఘటనపై వచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, దర్యాప్తులో భాగంగా బుధవారం నాడు జనంపల్లి క్రాస్‌రోడ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, మేకల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. అనుమానితుల దగ్గర నుండి రూ.10,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ మరియు దొంగతనాలకు ఉపయోగించిన స్విఫ్ట్ కారు (ఏపీ 09 బిక్యూ 3128) స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేయగా దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడైంది. నిందితులపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్ఐ గోపతి సతీష్ తెలిపారు.

