ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeతెలంగాణఅడ్డగూడూరు పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు

అడ్డగూడూరు పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు

 

– ముఖ్య అతిధులుగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య

అడ్డగూడూరు (సంచలనం వెబ్ న్యూస్): మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు విద్యార్ధులకి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.సతయ్య హాజరై, విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ భద్రత, బాల్య వివాహాల నివారణ, బాలల హక్కులు మరియు వివిధ చట్టపరమైన అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా బాల్య వివాహాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్య మరియు విద్యాపరమైన నష్టాలను వివరించి, బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సంబంధిత అధికారులను లేదా న్యాయ సేవా సంస్థలను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కునూరు శ్రీనివాస్, అడ్వకేట్ నర్సింహ, పారా లీగల్ వాలంటీర్లు లింగయ్య, యాదయ్య, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యులు కె.శ్రీశైలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఇటువంటి చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!