ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeతెలంగాణజయశంకర్ భూపాలపల్లిప్రభుత్వ హామీలు, పెండింగ్ పనులు పూర్తి చేయాలి

ప్రభుత్వ హామీలు, పెండింగ్ పనులు పూర్తి చేయాలి

– ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేత

శాయంపేట(సంచలనం వెబ్ న్యూస్): మండలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను, పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేయాలని బహుజన సంక్షేమ సంఘం(బిఎస్ఎస్ )ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి వినతి పత్రం అందజేశారు. శాయంపేట మండలంలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ మరియు మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం శంకుస్థాపన, మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ మరియు 108 సిబ్బంది కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని మండలంలో ఉన్న బెల్టు షాపులను మూసివేయాలని ఎమ్మెల్యేకు తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేయాలని ఆ దిశగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అయిన ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడం బాధాకరమని తెలిపారు. ఇట్టి విషయాలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మారపల్లి క్రాంతి కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, హనుమకొండ జిల్లా కార్యదర్శి మారేపల్లి విజయ్ కుమార్, శాయంపేట మండల అధ్యక్షులు మారెపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!