ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeతెలంగాణమునిపంపుల పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు

మునిపంపుల పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

– రామన్నపేట మండల న్యాయ సేవ అధికార సంస్థ నిర్వహణ

– ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష

రామన్నపేట(సంచలనం వెబ్ న్యూస్): మండల పరిధిలోని మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, ఏజీపి సుక్క శ్రావణ్ కుమార్, ప్యానల్ అడ్వకేట్ యాదాసు యాదయ్య, ఎన్.రమేష్, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్ లు హాజరయ్యారు. ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు రాయపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్ధులు ముఖ్యంగా అన్ని రంగాలలో ముందు ఉండాలన్నారు. విద్యా వ్యవస్థ వల్లనే ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంటది. విద్యార్ధులకి ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. అందరికీ పలు రకాల చట్టాలపై అవగాహన పొందాలని, విద్యా హక్కు చట్టం, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్యవివాహాలు, ఫోక్సో చట్టం, లేబర్ చట్టాలు, మాదక ద్రవ్యాలు, అన్ని రకాలుగా ఎలాంటి సమస్య వచ్చిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్ధులకి పాఠశాలలో గాని, వచ్చి వెళ్ళే దారిలో ఆకతాయిల వల్ల గాని ఏమైనా సమస్య అనిపించిన వెంటనే పాఠశాలలో ఏర్పాటు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కి గానీ, స్థానిక పోలీస్ స్టేషన్ లలో గానీ, మండల స్థాయిలో ఉన్న న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి గాని తీసుకురావాలని, ఎవరు కూడా అధైర్య పడవద్దని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్ది వేరే బయటి ఆలోచనలు పెట్టుకోకుండా, పుస్తకాలు చదవడం మీదనే దృష్టి పెట్టాలి, చెడు దారి పట్టించే ఆలోచనలు పక్కకి నెట్టేసి, ఏమి ఆలోచనలు చేసిన మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని అన్నారు. సమాజం పట్ల మంచి అవగాహనతో ఉండాలన్నారు. సమాజంలో మన హక్కులు, బాధ్యతలు నిర్వహణలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డి.సరోజ, లీగల్ సర్వీసెస్ సభ్యులు కురిమేటి యాదయ్య, అధ్యాపక బృందం, విద్యారులు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!