ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeతెలంగాణసీనియర్ జర్నలిస్టు కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

సీనియర్ జర్నలిస్టు కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

భువనగిరి(సంచలనం వెబ్ న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారులు కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం వర్థిల్లాలి, భారత రాజ్యాంగం ను కాపాడుకుందాం, అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్ల పై ముద్రించాలని నినాదాలు చేశారు. అనంతరం కొడారి వెంకటేష్ ను శాలువాతో సన్మానించి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీ సంఘాలకు చెందిన నాయకులు బట్టు రామచంద్రయ్య, బర్రె సుదర్శన్, బుచ్చాల స్వామి, పుట్ట వీరేష్ యాదవ్, గుండె బోయిన సురేష్ యాదవ్, ఎండీ ఇంతియాజ్ అహ్మద్, ఎండీ సానూర్ బాబా, ఎండీ జాకీర్, పల్లెర్ల వెంకటేష్, సిలివేరు రమేష్, నల్ల కృష్ణ, సున్నం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!