సీనియర్ జర్నలిస్టు కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

భువనగిరి(సంచలనం వెబ్ న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారులు కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం వర్థిల్లాలి, భారత రాజ్యాంగం ను కాపాడుకుందాం, అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్ల పై ముద్రించాలని నినాదాలు చేశారు....