ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeతెలంగాణతాజ్ పూర్ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు

తాజ్ పూర్ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు

📰 Generate e-Paper Clip

శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు, అధికారులు, గ్రామస్తులు

భువనగిరి జిల్లా ప్రతినిధి, జూలై 19(సంచలనం న్యూస్): హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదిక లో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ వారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ వారి అర్ ఎస్ కె ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ‘లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ ‘ అవార్డు ముఖ్య అతిధి గా విచ్చేసిన ప్రముఖ సినీ నటులు పృథ్వి రాజ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మీ లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని కొనియాడారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇలాంటి అవార్డు లు మాకు భవిష్యత్తు లో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి తొడ్పాటు అందిస్తాయని ఎల్లవేళలా మాకు వెన్నంటి ఉండి నడిపిస్తున్న గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డా, పట్నం కమలా మనోహర్ మరియు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!