SANCHALANAM NEWS
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 4:53 pm Posted by : SANCHALANAM NEWS

విద్యార్దులు చదువు పట్ల శ్రద్ధ చూపాలి

– సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య

– ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు


రామన్నపేట, జూలై 17(సంచలనం న్యూస్): విద్యార్దులు చదువు పట్ల శ్రద్ధ వహించాలని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య అన్నారు. రామన్నపేట మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సుకి ముఖ్య అతిథులుగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య, ఏజిపి సుక్క శ్రావణ్ లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్దులు అన్ని రంగాలలో ముందు ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్దులు తప్పని సరిగా విద్యాహక్కు చట్టం, బాల కార్మిక చట్టాలు, లేబర్ చట్టాలు, మాదక ద్రవ్యాలు, మన చుట్టుపక్కల మన దృష్టికి వచ్చే బాల్య వివాహాలు, ఫోక్సో చట్టాలు, తదితర విషయాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎవరు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని సూచించారు. ప్రతి పాఠశాలలో చట్టాలకి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని అందులో విద్యార్ధులు భాగస్వామ్యం కావాలని అన్నారు. విద్యార్ధులకి ఎలాంటి అసౌకర్యాలు, సమస్యలు వచ్చిన స్థానిక పోలీస్ స్టేషన్ లో గాని, మండల న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి గానీ తీసుకువచ్చి పరిష్కారం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సురేందర్ రెడ్డి, లీగల్ సర్వీసెస్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, అధ్యాపకులు శేషా చారి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎండి జరీనా, ఎన్.విజయ, కె.శ్రీలక్ష్మి, బి. నాగమణి, ఎండి.అజీజ్, ఎండి.రహిమున్నీసా, ఓఎస్ లు ఆర్.రవి, చక్రపాణి, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.