SANCHALANAM NEWS
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 8:44 pm Posted by : SANCHALANAM NEWS

రామన్నపేట సీఐ గా బాధ్యతలు చేపట్టిన మోలుగురి రవి

రామన్నపేట, జూలై 23(సంచలనం న్యూస్): రామన్నపేట నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మోలుగురి రవి గురువారం బాధ్యతలు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల డీటీసీ చేసి బదిలీపై రామన్నపేట కి వచ్చారు. రామన్నపేట లో పని చేసిన సీఐ ఎన్.వెంకటేశ్వర్లు మల్టీ జోన్ -2 కు బదిలీ పై వెళ్ళారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతిభద్రతలు కాపాడే విషయంలో అందరూ సహకరించాలని, సమాజానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.