SANCHALANAM NEWS
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:10 pm Posted by : SANCHALANAM NEWS

మాదిగ సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశం

– వచ్చే నెలలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా

– సమావేశంలో ప్రకటించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

హైదరాబాద్(సంచలనం వెబ్ న్యూస్): మాదిగల సమస్యలపై పరిష్కార దిశగా అడుగులు వేయడానికి ఆదివారం నాడు తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ యాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో 2019 నుండి ఇప్పటి వరకు సంఘం చేసిన ఉద్యమాలను సభ్యులకు వివరిస్తూ, చర్చించారు. గతంలో దళిత బంధు పైన, ఎస్సీ వర్గీకరణ పైన వివిధ అంశాల పైన ఉద్యమం చేసిన విధి విధానాలపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం కొరకు నిధులను బడ్జెట్లో కేటాయించి, అర్హత గల సభ్యుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, నిధులను విడుదల చేయకుండా, పంపిణీ చేయకుండా, ప్రభుత్వము అనుసరిస్తున్న వైఖరిని తెలిపారు. వీలైనంత తొందరలో రాజీవ్ యువ వికాస్ నిధుల విడుదలకై సమస్యను ప్రభుత్వము దృష్టికి తీసుకుపోయేలా కార్యక్రమము రూపొందించి నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో మాదిగల సమస్యలపై పోరాటం చేస్తూ పరిష్కారం కోసం వచ్చే నెలలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేయనున్నట్లు ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కడతాల విజయలక్ష్మి, మహిళా ఉపాధ్యక్షురాలు గజ్జల సంపూర్ణ, ప్రధాన కార్యదర్శి.గోర్ల సరస్వతి, నకిరేకంటి వెంకట్, నాగమణి, చుక్క శ్రీను, మంద స్వామి, వంగాల నాగరాణి, శోభ, మాణక్క, తిరుమల, కడియం విజయ, బైండ్ల రాంబాబు విద్యార్థి విభాగం నాయకులు, వివిధ జిల్లాల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.