SANCHALANAM NEWS
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 10:08 pm Posted by : SANCHALANAM NEWS

ఎన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకి అవగాహన సదస్సు

– రామన్నపేట మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ

– ముఖ్య అతిధులుగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రత్నకుమారి

రామన్నపేట(సంచలనం వెబ్ న్యూస్): మండల పరిధిలోని ఎన్నారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల న్యాయ సేవ అధికార సంస్థ రామన్నపేట ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రత్నకుమారి హాజరయ్యారు. పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు రమబాయి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్ధులు అన్ని రంగాలలో ముందు ఉండాలని, వారికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పని సరిగా ఉండాలని అన్నారు. విద్యా వ్యవస్థ వల్లనే ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంటదనీ, ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. అందరికీ పలు రకాల చట్టాలపై అవగాహన పొందాలని, విద్యా హక్కు చట్టం, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్యవివాహాలు, ఫోక్సో చట్టం, లేబర్ చట్టాలు, మాదక ద్రవ్యాలు, అన్ని రకాలుగా ఎలాంటి సమస్య వచ్చిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పిల్లకి గాని, పెద్దలకి గాని, వృద్ధులకు గాని ఏ సమస్య ఎదురైన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లలో గానీ, మండల స్థాయిలో ఉన్న న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి గాని తీసుకురావాలని, ఎవరు కూడా అధైర్య పడవద్దని సూచించారు. చెడు దారి పట్టించే ఆలోచనలు పక్కకి నెట్టేసి, ఏమి ఆలోచనలు చేసిన మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని అన్నారు. సమాజం పట్ల మంచి అవగాహనతో ఉండాలన్నారు. సమాజంలో మన హక్కులు, బాధ్యతలు నిర్వహణలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఏ మజీద్, ప్యానల్ అడ్వకెట్ కూనూరు శ్రీనివాస్, అడ్వకేట్ పాల్వంచ జగతయ్య, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, అగ్రీ క్లినిక్ సభ్యులు కానుగంటి శ్రీశైలం, అధ్యాపక బృందం, విద్యారులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.